NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంచాయితీల నిధుల సమకూర్పుపై సిబ్బందికి శిక్షణ

1 min read

డిఎల్ డీఓ అన్వరా బేగం..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : గ్రామ పంచాయతీలను ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలనే వాటి గురించి అధికారులకు ఆత్మకూరు డివిజనల్ అభివృద్ధి అధికారి అన్వరా బేగం అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉ 10 గం.ల నుండి సా 5 వరకు గ్రామ పంచాయతీలకు సొంతంగా నిధులు సమకూర్చుకొనుట మరియు మరియు స్వామిత్వ గురించి డిఎల్ డివో శిక్షణ ఇచ్చినట్లు ఎంపీడీవో దశరథ రామయ్య తెలిపారు.పంచాయితీ కార్యదర్శులు,విఆర్వోలు,డిజిటల్ అసిస్టెంట్లు,గ్రామ సర్వేయర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణఇచ్చినట్లు ఎంపీడీవో తెలిపారు.దేవనూరు పీఎస్ సుంకన్న,వీపనగండ్ల  సర్వేయర్ రాంబాబు, చింతలపల్లి వీఆర్వోరహీం శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు సంజన్న,సురేష్ కుమార్ పాల్గొన్నారు.

About Author