NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హుండీల లెక్కింపు…

1 min read

శ్రీశైలం, న్యూస్​ నేడు:  హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 3,72,50,251/- నగదు రాబడిగా లభించింది. కాగా  ఈ హుండీల రాబడిని భక్తులు గత 21 రోజులలో  ( 22.12.2025 నుండి 11.01.2026 వరకు)  సమర్పించడం జరిగింది. అలాగే  ఈ హుండీలో 158 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారు, 11 కేజీల 460 గ్రాముల వెండి లభించాయి.అదేవిధంగా  1570 – యుఎస్ఏ డాలర్లు,   180 – యు.ఎ.ఇ దిర్హమ్స్,  1- కువైట్ దినార్,  5 – సౌదీరియాల్స్,  17 – సింగపూర్ డాలర్లు, 10 – కెనడా డాలర్లు,   65 – ఇంగ్లాండు ఫౌండ్స్ , 11 – మలేషియా రింగిట్స్,  12510 – ఓమన్ బైసా,   50 –  ఆస్ట్రేలియా డాలర్లు,  8 – ఈరోస్,  5 – ఐర్లాండ్,  1500 – మయన్మార్, 10,000 –  ప్రాన్స్ , 50 – ఫిలిప్పీన్‌ , 2000 – వియత్నామ్  మొదలైన  విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.       పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.         ఈ హుండీల లెక్కింపులో  కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు    శ్రీ ఎ.వి. రమణ, శ్రీ చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు  పాల్గొన్నారు.

About Author