గోసంరక్షణ సమాజ శ్రేయస్సుకు, ధర్మ పరిరక్షణకు పునాది
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.
వై. కానాపూర్ నందు ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: భారతీయ సంస్కృతిలో గో సంరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని, ఆర్థిక, వ్యవసాయ, ఆధ్యాత్మిక జీవన విధానాలకు ఆధారంగా భావించబడుతున్న గోసంరక్షణ ద్వారా వ్యవసాయం బలోపేతమవడమేకాకుండా, ప్రకృతి సమతుల్యత పరిరక్షించ బడుతుందని అందువల్ల గోసంరక్షణ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, సమాజ శ్రేయస్సుకు మరియు ధర్మ పరిరక్షణకు పునాదిఅని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గూడూరు మండలం, వై. కానాపూర్ గ్రామంలోని శివాలయంనందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్బంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజులు డమాం జగదీశ్ చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలి నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో పూజారి మద్దిలేటి, సత్సంగసభ్యులు యు.ఈరన్న, యు. చిన్నరాముడు, చదువులన్న, జయరాములు, రామాంజనేయులుతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



