NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెవెన్యూ అంశాలపై రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్

1 min read

రీ సర్వే సమస్యల పరిష్కారంతో ప్రజలకు మెరుగైన సేవలు – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల,  న్యూస్​ నేడు: రీ –సర్వే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శక సేవలు అందిస్తామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని సీసీఎల్ఏ కార్యాలయం నుంచి రెవెన్యూ క్లినిక్స్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టం – పీజీఆర్ఎస్), రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, మ్యుటేషన్లు, ల్యాండ్ క్లాసిఫికేషన్, జీరో నంబర్ ఖాతాలు, జీరో ఎక్స్టెంట్ ఖాతాలు, జాయింట్ ఎల్పిఎంలు, రీ సర్వే, వెబ్ల్యాండ్ పోర్టింగ్, వాటర్ ట్యాక్స్ తదితర కీలక రెవెన్యూ అంశాలపై జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

About Author