NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధి హామీ శ్రామికులతో కలిసి మట్టి పని చేసిన  దెందులూరు ఎమ్మెల్యే

1 min read

పెదవేగి మండలం విజయరాయిలో శ్రామికులతో ఆత్మీయంగా మమేకమైన ఎమ్మెల్యే

గ్రామ అభివృద్ధిలో శ్రామికుల పాత్ర వెలకట్టలేనిది

ఎండల దృష్ట్యా శ్రామికులకు తగిన వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి విజయరాయిప్రజల మనిషిగా, క్షేత్రస్థాయి కార్యకర్తగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. బుధవారం పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో పర్యటించిన ఆయన, అక్కడ ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన శ్రామికులను ఆత్మీయంగా పలకరించారు. కేవలం పలకరించడమే కాకుండా, స్వయంగా పార పట్టి శ్రామికులతో కలిసి కాసేపు మట్టి పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో, మౌలిక వసతుల కల్పనలో ఉపాధి హామీ శ్రామికుల కష్టం ఎంతో విలువైనదని కొనియాడారు. కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని, శ్రామికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఎంఏల్ఏ స్వయంగా తమతో కలిసి పని చేయడంతో ఉపాధి హామీ శ్రామికులు ఎంతో ఉత్సాహాన్ని పొందారు. తమ కష్టాన్ని గుర్తించి మమేకమైన ఎమ్మెల్యే పై వారు ఆత్మీయంగా కృతజ్ఞతలు తెలిపారు.తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా శ్రామికుల ఆరోగ్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. “వేసవి తాపం వల్ల శ్రామికులు డీహైడ్రేషన్ బారిన పడకుండా పని ప్రదేశాల్లో మంచినీరు, ఇతర అవసరతలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పర్యవేక్షకులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని హితవు పలికారు.”శ్రామికుల మధ్య సామాన్యుడిలా కలిసిపోయి వారు పడుతున్న కష్టాన్ని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే చింతమనేని తీరు నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ శ్రామికులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *