NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎరిగేరి నుంచి ఉరుకుంద క్షేత్రానికి కృష్ణమ్మ కాలినడక యాత్ర

1 min read

భక్తిశ్రద్ధలతో శ్రీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న జిల్లా అధ్యక్షురాలు

ఆదోని, న్యూస్​ నేడు: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ గారు బుధవారం ఉదయం ఎరిగేరి నుంచి ఉరుకుంద క్షేత్రం వరకు భక్తిశ్రద్ధలతో కాలినడక యాత్ర చేపట్టారు.ఎరిగేరి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో కృష్ణమ్మ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక భక్తిభావంతో సాగిన ఈ యాత్రలో స్వామివారి నామస్మరణ చేస్తూ ఉరుకుంద క్షేత్రానికి చేరుకున్నారు.అనంతరం ఉరుకుంద క్షేత్రంలోని శ్రీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆధ్యాత్మికత మనలో ఆత్మవిశ్వాసాన్ని, సేవాభావాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు.ఈ కాలినడక యాత్రలో టీడీపీ నాయకులు LLC చైర్మన్ టిప్పు సుల్తాన్,బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు,కౌతాళం మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, కురువ వీరేష్, వడ్డేమాన్ గోపాల్, రామలింగ, మురళి, బెస్త ఓంకార్, బజారప్ప, దేవేంద్ర, మహాదేవ, బాబురావు, హనుమంతు, నర్సప్ప, గనేకల్ బంగారు బాబు,అంజి, మంత్రికి ముని, చిన్న చిట్టి, పెద్ద చిట్టి, ఉపేంద్ర, వెంకటేష్,కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *