NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవరగట్టు దనరా ‘ బన్ని ‘ ఉత్సవాలు

1 min read

అక్టోబర్ 2న మాళ మల్లేశ్వరాస్వామి కల్యాణోత్సవం, ‘బన్ని” ఉత్సవం

దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి వెలిసిన కొండ ఇదే

నెరణికిలో బన్ని ఉత్సవాలకు వురోహితులు ఖరారు చేసిన ముహూర్ధం ప్రతిని విడుదల చేస్తున్న నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామపెద్దలు, ఎస్ఐ దిలీప్ కుమార్

హొళగుంద న్యూస్ నేడు :   రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న దేవరగట్టు శ్రీమాళ సహిత మల్లేశ్వరస్వామి దనరా బన్ని ఉత్సవాలకు సంబంధించి బుధవారం నెరణికి గ్రామంలో పురోహితులు మూహూర్తం ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఉత్సవాల ఆహ్వాన ప్రతిని ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి, హొళగుంద ఎస్ఐ దిలీప్కుమార్తో కలిసి ఉత్సవ నిర్వాహాకులయిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు, ఆలయ పూజారులు విడుదల చేశారు. త్వరలోనే కరపత్రాలను ముద్రించి అన్ని ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. సెప్టంబర్ 27వ తేదీ శనివారం దేవరగట్టులో మాత మాళమ్మ మల్లేశ్వరునికి కంకణధారణం, నిశ్చితార్ధము, అక్టోబర్ 2వ తేది గురువారం విజయదశమి రోజున కల్యాణోత్సవం, బన్ని, జైత్రయాత్ర, 3వ తేదీ శుక్రవారం భవిష్యవాణి (దైవవాణి),4న శనివారం సాయంత్రం స్వామివారి రధోత్సవం, 5న ఆదివారం గౌరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, సాయంత్రం దేవదాసీల క్రీడోత్సవం, 6వ తేది సోమవారం మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహాకులు తెలిపారు.

About Author