NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ను కలిసిన మంత్రాలయం ఎమ్మెల్యే

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు బుధవారం వచ్చిన కర్నాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ దంపతులను శ్రీ మఠం విఐపి వసతి గృహంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం కర్నాటక రాజకీయాల గురించి చర్చించారు. వీరి వెంట వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, ఇన్చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, పెద్దకడుబూరు వైకాపా నాయకులు పురుషోత్తం రెడ్డి వైకాపా నాయకులు ఉన్నారు.

About Author