ఆదోని జిల్లా తోనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి
1 min read
ఆదోని జిల్లాకై మంత్రాలయంలో గొంతెతిన విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు
విద్యార్థులతో రాఘవేంద్ర సర్కిల్లో మానవహారం
మంత్రాలయం న్యూస్ నేడు : కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆదోని ని జిల్లాగా ప్రకటించాలని అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆదోని జిల్లా సాధన జేఎసి గౌరవ అధ్యక్షులు కమల గణేష్, ఖాజ, ఏనుగు బాల సత్య రెడ్డి, దస్తగిరి నాయుడు, బతుకన్న, ఉదయ్, నాయకులు ఆదోని కోదండ, విద్యార్థి జేఏసి కన్వీనర్ శేఖర్ నాయుడు, కో కన్వీనర్ కృష్ణ, థామస్, రఘు, అఫ్రీది, మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు హోటల్ పరమేష్, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో విద్యార్థి యువజన ప్రజాసంఘాలు, ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి మానవహారం ఏర్పాటు చేసి ధర్నా అనంతరం తహసిల్దార్ రమాదేవి కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అయినా ఆదోని ని జిల్లాగా ప్రకటించడంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని మండి పడ్డారు. పశ్చిమ ప్రాంతంలో ఆదోని తరతరాలుగా అభివృద్ధిలో వెనుక పడుతుందని, ఆదోని జిల్లాగా ప్రకటిస్తే పశ్చిమ ప్రాంతంలో విద్యా ,వైద్యం, సాగు త్రాగునీరు, పరిశ్రమలు , ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పశ్చిమ ప్రాంత ప్రజలు వైద్యం కోసం మరియు ఇతర పనుల కోసం మంత్రాలయం , ఆదోని, ఆలూరు, కౌతాళం , ఎమ్మిగనూరు, పత్తికొండ ,కోసిగి ప్రాంతాల నుండి కర్నూలు వెళ్లాలంటే దాదాపుగా 150 కిలోమీటర్ల వరకు వెళ్లి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని కావున ఆదోని జిల్లా గా ఏర్పడితే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి జరిగి ప్రజలకు పాలన అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు. ఆదోని జిల్లా ను ఏర్పాటు చేయాలని ,రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్న పట్టినట్లు ఆదోని జిల్లాపై వ్యతిరేక ధోరణి అవలంబిస్తూ పశ్చిమ ప్రాంత ప్రజల ఓట్లతో గదెనెకిన ఎమ్మెల్యేలు సైతం ఆదోని జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా ఆదోని జిల్లా ఏర్పాటు చేయకుండా అభివృద్ధికి అడ్డుపడుతూ పశ్చిమ ప్రాంత ప్రజలకు మోసం చేస్తూ వ్యతిరేక ధోరణి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆదోని జిల్లా ఏర్పాటుపై కూటమి ఎమ్మెల్యేలు మౌనం విడి ఆదోనిని జిల్లాగా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, లేనిపక్షంలో నియోజకవర్గ మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు ఏర్పాటుచేసి ఆదోని జిల్లాగా ప్రకటించేంతవరకు ఉద్యమాలు చేపడతామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు ,ఈరన్న, అమరేష్ , నేపాల్,విష్ణు, రాజు, నవీన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


