NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిఎం సూర్య ఘర్ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి

1 min read

రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ మీద జీఎస్టీ  18 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు  గురించి అవగాహన కల్పించండి

ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ లు..ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : పిఎమ్ సూర్య ఘర్ పథకంలో భాగంగా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ మీద జీఎస్టీ  18 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు  ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ ఛాంబర్ లో పీఎం సూర్య ఘర్ కి సంబంధించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంను కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిఎం సూర్య ఘర్ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీ సభ్యులను ఆదేశించారు.. ఈ పథకం కింద  2026-2027 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశం అంతటా 1 కోటి గృహాలకు పైకప్పు సౌర వ్యవస్థలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగ జిల్లాలో లక్ష గృహాలకు పైకప్పు సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసే విధంగా లక్ష్యాలను  నిర్దేశించుకోవాలని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈవో, డిఆర్డిఏ, మెప్మా పిడి లను, డిపిఓ లను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ లు ఇస్తోందని,  ఈ అంశంపై శ్రద్ధ వహించి  సోలార్ ప్యానెల్ లను  ఇన్స్టాల్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.సమావేశంలో  ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ప్రదీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, ఎల్ డి ఎం రామచంద్ర రావు, డి ఆర్ డి ఏ పిడి రమణా రెడ్డి, మెప్మా పిడి శ్రీనివాసులు, నెడ్ క్యాప్ అధికారి  తదితరులు పాల్గొన్నారు.

About Author