విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యం
1 min read
మిడుతూర్ లో ఘనంగా మెగా పిటీఎం..
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: విద్యార్థులకు క్రమశిక్షణ మరియు నైతిక విలువలు ఎంతో అవసరమని నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం మోడల్ పాఠశాల విద్యార్థులకు సూచించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న మోడల్ పాఠశాలలో శుక్రవారం జరిగిన తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం(మెగాపిటిఎం 4.0)కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపల్ బీటీ శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా కేజీబీవీ పాఠశాలలో ఎస్ఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా అలరించాయి.మండలంలోని మండల జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,ఎంపీడీవో దశరథ రామయ్య, తహసిల్దార్ శ్రీనివాసులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



