NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలం లో… అన్నప్రసాద వితరణ

1 min read

శ్రీశైలం , న్యూస్​ నేడు:  మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడుతుండడంతో  ఈ ( 29.10.2025) ఉదయం శ్రీశైలానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా దేవస్థానం భక్తులకు శిఖరేశ్వరం, బస్టాండులలో అన్నప్రసాదాలను అందజేస్తోంది. ఈ రోజు (29.10.2025) ఉదయం కార్యనిర్వహణాధికారి వారు శ్రీ యం.శ్రీనివాసరావు, శిఖరేశ్వరం వద్ద ఈ అన్నప్రసాద  పంపిణీని ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయన్నారు. ముందుజాగ్రత్తచర్యలలో భాగంగా అధికారులు శ్రీశైలానికి వాహనాల రాకపోకలను నిలిపివేయడం జరిగిందన్నారు.  ఈ అన్నప్రసాద వితరణలో ఉదయం పులిహోరతో పాటు అల్పాహారంగా ఉప్మా కూడా అందజేయబడింది. అదేవిధంగా మధ్యాహ్నం సాంబారన్నం,పెరుగన్నం అందజేయబడుతున్నాయి.      (కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ

About Author