స్టేడియం రోడ్డులో ఈట్ స్ట్రీట్ ఏర్పాటుకు లక్కీ డ్రా
1 min read
39 స్టాల్స్ వ్యాపారులకు కేటాయింపు
60 స్టాల్స్ ఏర్పాటుకు ప్రణాళిక
700 అడుగుల వెడల్పు రహదారిపై నిర్వహణ
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం కర్నూలు నగరంలోని స్టేడియం రోడ్డులో ప్రజల సౌకర్యార్థం ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయనున్నట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో లక్కి డ్రా నిర్వహించారు. 60 షాపుల నిర్వహణకు ప్రణాళికలో రూపొందించారు. అందులో 39 షాపులను లక్కీ డ్రా ద్వారా కేటాయించారు.ఈట్ స్ట్రీట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే నగర సౌందర్యం మరింత పెరుగుతుందని, పౌరులు మరియు పర్యాటకులు ఆకర్షితులవుతారని కమిషనర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ మనోహర్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, సూపరింటెండెంట్ సుబ్బన్న, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సిఎంఎం భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

