NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద సెల్ఫోన్ ల దొంగను వలవేసి పట్టుకున్న రైల్వే పోలీసులు

1 min read

ఒంటరిగా ప్రయాణించే పాసింజర్లపై భౌతిక దాడులు చేసి సెల్ఫోన్లు దొంగతనం

రైల్వే ఐజిపి బి.రాజా కుమారి, రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్, నేతృత్వంలో స్కెచ్ ఆపరేషన్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద కొన్నాళ్లుగా రైలు దిగి  ఒంటరిగా ప్రయాణించే పాసింజర్లను చాటుగా మాటువేసి అవసరమైతే భౌతిక దాడులకు పాల్పడి గాయపరిచి సెల్ పోన్ లు గుంజుకు పోవడానికి అలవాటుపడిన కరుడుగట్టిన సెల్ పోన్ దొంగను ఎట్టకేలకు రైల్వే పోలీసులు వల వేసి పట్టుకున్నారు,వివరాలలోకి వెళితే ఏలూరు మారుతీ నగర్ కు చెందిన కళ్లెపల్లి సతీష్ (19)

ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా ప్రయాణించే రైల్వే పాసింజర్లనుండి సెల్ పోన్ లు

దొంగతనాలకు అలవాటు పడ్డాడని రైల్వే పోలీసులకు సమాచారం అందింది,ఇతని పూర్తి సమాచారం తెలుసుకున్న విజయవాడ రైల్వే పోలీస్ ఐ జి పి  బి.రాజా కుమారి నేతృత్వం లో రాహుల్ దేవ్ సింగ్ ఐ పి ఎస్ రైల్వే ఎస్ పి విజయవాడ,రైల్వే డి ఎస్ పి జి జయసూర్య పర్యవేక్షణలో రైల్వే సి ఐ ఎమ్ వి దుర్గారావు బృందం ప్రత్యేక స్కెచ్ వేసి సెల్ పోన్ అలవాటు దొంగ సతీష్ ని  పోలీస్ వలపన్ని పట్టుకున్నారు,అతని వద్దనుం డి ఒప్పో,మోటో వంటి ఖరీదైన పోన్ లను ఒక వెదురు కర్ర ను స్వాధీనం చేసుకున్నామని మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు,సతీష్ ఇచ్చిన సమాచారం తో చాందిని మొబైల్స్ యజమాని ఆకుల పూర్ణను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద నున్న మరో 4 సెల్ పోన్ లను స్వాధీనం చేసుకుని సతీష్ ని రిమాండ్ కు పంపి ఆకుల పూర్ణ నాగేందర్ పై బి ఎన్ ఎస్ 317 (2) తో పాటు సెక్టోన్ 35 (3) బి ఎన్ ఎస్ ఎస్ నోటీసులు అందజేసామని రైల్వే పోలీస్ లు   మీడియాకు  తెలిపారు,మొత్తం మొబైల్స్ ఖరీదు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని రైల్వే సి ఐఎమ్ వి దుర్గారావు తెలిపారు,ఈ ఆపరేషన్ లో పాల్గొన్న రైల్వే పోలీస్ సిబ్బంది కృపాదాసు ,మల్లేశ్వరరావు,ప్రసాద్,హోంగార్డు కుమార్ ను రైల్వే ఎస్ పి అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *