దళిత క్యాథలిక్ జేఏసీ ఆధ్వర్యంలో సీఎం ని కలిసిన నాయకులు
1 min read
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని వినతి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దళిత క్యాథలిక్ జేఏసీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబునాయుడు ని కలిసిన వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు ని కలిసిన నేషనల్ దళిత క్యాథలిక్ జెఎసి చైర్మన్ పెరికే వరప్రసాదరావు నేషనల్ దళిత క్యాథలిక్ జేఏసీ ఢిల్లీ ప్రెసిడెంట్ టి. ఎం.కె.మార్టిన్ లూథర్ ఇప్పటికే వైఎస్ఆర్సిపి అధినేత వైస్ జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలను ఎమ్మెల్సీలను ఢిల్లీకి పంపి జస్టిస్ బాలకృష్ణ కమిషన్ నివేదిక దళిత క్రైస్తవులకు ఫేవర్ గా రావాలని కోరడం జరిగిందని అదేవిధంగా కోట మీ ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బిజెపి కూడా బాలకృష్ణ కి నివేదిక సమర్పించాలని అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై ఒత్తిడి తీసుకువచ్చి దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని కోరారు. అదే విధంగా 1956లో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారని అదేవిధంగా 1990లో బౌద్ధమతం స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా కల్పించారని 1996లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే భారత దేశ ప్రధాని పీవీ నరసింహారావు బిల్లు పెట్టి సాంకేతిక లోపాలని చూపుతూ చేతులు దులుపుకున్నారని అప్పటినుంచి ఇప్పటివరకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించలేదని తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని ఢిల్లీ ఏపీ భవన్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నీ కోరడం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారనిటి.ఎం.కె.మార్టిన్ లూథర్ తెలిపారు.


