NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు రిడ్జ్ పాఠశాల విద్యార్థుల ఎంపిక

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు పి. అబేద్య, ఎం.డి. ఉబైద్-ఉర్-రహీం, డి. వరుణ్ సిద్ధార్థ్ రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు సెప్టెంబర్ 25 నుంచి 27వ తేదీ వరకు విజయనగరంలో నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాఠశాల సీఈఓ జి. గోపీనాథ్  మాట్లాడుతూ, “విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో కీలకం. క్రీడలు విద్యార్థుల్లో పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు. కో-సీఈఓ జి. సౌమ్య గోపీనాథ్ గారు మాట్లాడుతూ, “క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు  ముఖ్యంగా విలువిద్య వంటి క్రీడలు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన వంటి విలువలను పెంపొందిస్తాయి. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు కష్టపడి సాధన చేసి మరిన్ని విజయాలు సాధించాలని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.విద్యార్థులకు శిక్షణ అందిస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచేందుకు కృషి చేసిన ఆర్చరీ కోచ్ ఆర్. శ్యాం కుమార్ ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ పి.కె. రాజేంద్రన్ గారు, ప్రిన్సిపల్ ఏ. రాజ్ కమల్  , హెచ్‌ఓడీలు నాగేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *