ఏకలవ్య సేవ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ
1 min read

ప్యాపిలి , న్యూస్ నేడు: ఏకలవ్య సేవ సమితి ఆధ్వర్యంలో ప్యాపిలి పట్టణంలోని ఏకలవ్య విగ్రహం వద్ద వినాయకచవితి పండుగ సందర్భంగా మట్టి విగ్రహాల ప్రాముఖ్యత లో ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ ను దృష్టిలో ఉంచుకొని ప్రకృతి కి ఎటువంటి హాని కలిగించని మట్టి విగ్రహాలను ప్యాపిలి పట్టణ ప్రజలకు మంగళవారం ఉచితంగా పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ సి. ఎల్లప్ప ఆయన సతీమణి ఏకలవ్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు సి.ఎచ్. మనోరమ మరియు సమితి సభ్యులు శేఖర్ , శేషాద్రి , మహేంద్ర ,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


