ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సీఐకి వినతి
1 min read
ఆవాజ్ కమిటీ నాయకులు..
నందికొట్కూరు న్యూస్ నేడు: నందికొట్కూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పట్టణ సీఐ ఎన్ అశోక్ కుమార్ కు ఆవాజ్ కమిటీ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా అవాజ్ కమిటీ అధ్యక్షులు సలాం ఖాన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణ సీఐకి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.పట్టణంలోకి వచ్చే భారీ వాహనాలను బైపాస్ మీదుగా వెళ్లే విధంగా చూడాలన్నారు. రోజురోజుకూ జనాభా పెరుగుతున్నందున ట్రాఫిక్ సమస్య వస్తుందని తాలూకా అధ్యక్షులు సలాం ఖాన్ అన్నారు.రాష్ట్రకమిటి సభ్యులు అబ్దుల్ రహిమాన్ మాట్లాడుతూ పట్టణంలో ప్రతిరోజు పగిడ్యాల రోడ్డు, నందికొట్కూరు చౌడేశ్వరి దేవాలయం నుండి మిడుతూరు రోడ్డు కూడలిలో ట్రాఫిక్ సమస్య ఉందన్నారు.ప్రతి కూడలిలో ఒక కానిస్టేబుల్ ను నియమించాలని అలాగే సోమవారం సంత ఉన్నందున పాతబష్టాండులో భారీ వాహనాల కారణంగా సంతకు వచ్చే ప్రజలు అనేక కష్టాలు ఎదురుకొంటున్నారని పగిడ్యాల రోడ్డునుండి పట్టణంలోకి వచ్చే భారీ వాహనాలను నీళ్ల ట్యాంక్ నుండి బైపాస్ మీదుగా మల్లించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సీఐకి సూచించారు.ట్రాఫిక్ ను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సీఐ తెలిపినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆవాజ్ నాయకులు అబ్దుల్లా,ఆదాం,ఆయిల్ షఫీ,షేక్షా,రియాజ్, పాల్గొన్నారు.


