సబ్సిడీపై మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ….
1 min read

ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతినీధన్యవాదాలు తెలిపిన మహిళలు..
హోళగుంద న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ ఆలూరు ఇన్చార్జి వైకుంఠం జ్యోతి సహకారంతో మహిళలకు 50% సబ్సిడీతో కుట్టు మిషన్లను హొళగుంద మండల సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హొళగుంద మండలం హెబ్బటం గ్రామం లో మహిళలకు 15 కుట్టు మిషన్లను 50% సబ్సిడీపై అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధితోపాటు, ప్రజా సంక్షేమంతో దూసుకెళ్తుందని తెలిపారు.ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి సహకారంతో సబ్సిడీపై మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోపాల్,ఉప సర్పంచ్ &యూనిట్ ఇంచార్జ్ సవారప్ప, క్లస్టర్ 1 ఇంచార్జ్ మల్లికార్జున, గ్రామ అధ్యక్షులు పాటయ్య, ఉపాధ్యక్షులు నాగయ్య, గ్రామ కమిటీ సభ్యులు గోసంగి సవరప్ప,శేఖర్, మాణిక్య, బూత్ కన్వీనర్ లు శేక్షవాలి,మీసేవ శీను, రవి,బీజేపీ కాళప్ప,గోనెగండ్ల ఈరన్న, బజారప్ప,మరియు కూటమి నాయకులు కార్యకర్తలు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

