నిర్మాణాలు ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు సమీక్ష
1 min read

జిల్లాలో పర్యాటక కేంద్రాలు,ప్రభుత్వ వసతి గృహాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు నిర్మాణాలు వేగవంతం చేయాలి
నాణ్యత ప్రమాణాలు పాటించి విద్యార్థులకు,పర్యాటకులకు వాడుకలోకి తీసుకురావాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :జిల్లా కలెక్టరేటు గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలో పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలు ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మండలాల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో 258 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు మంజూరు అయ్యాయని నిర్మాణాలు వేగవంతం చేసి, విద్యార్థులకు,పర్యాటకులకు వాడుకలోకి తీసుకురావాలని అన్నారు.ఇంకా మొదలుపెట్టని చోట టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను వెనువెంటనే మొదలు పెట్టాలన్నారు.ఒక్కో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు రూ 3 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని, పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. పనులు నాణ్యత విషయంలో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే అటువంటి అధికారులను గుర్తించి బాధ్యులను చేస్తామని అన్నారు.గత కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు క్షేత్రస్థాయిలో పరిశీలించి తలుపులు, విద్యుత్తు, వాటరు కనెక్షన్లు పరిశీలన చేసి,చిన్న చిన్న రిపేర్లు ఉంటే పూర్తి చేయాలన్నారు.అంగన్వాడి సెంటర్లో చిన్నారులను దృష్టిలో పెట్టుకుని టాయిలెట్స్ విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్ డబ్ల్యూ ఎస్ యస్ఇ జి.త్రినాథబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ అధికారి ఆర్.వి.నాగరాణి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ జిల్లా కో-ఆర్డినేటరు ఉమాదేవి, జిల్లా టూరిజం మేనేజరు యస్.పట్టాభిరామన్న, ఇంజనీరింగు అధికారులు పాల్గొన్నారు.


