బీసీల అభివృద్ధిలో యువతే కీలకం…
1 min read

బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు :చల్లా అనుదీప్
ప్యాపిలి, న్యూస్ నేడు: బీసీలు అన్ని రంగాలలో ఎదగాలంటే యువతే కీలకమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు చల్లా దీపు అన్నారు. విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం లొ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లకా వెంగళరావు యాదవ్ ఆధ్వర్యంలో బీసీల హక్కుల సాధనకై నిర్వహించిన మహాసభలలో యువజన అధ్యక్షులు చల్లా అనుదీప్ మాట్లాడుతూ మహాసభలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన నేషనల్ కమిషన్ ఓబీసీ కేంద్ర క్యాబినెట్ మంత్రి హన్సరాజ్ గంగారం అహిర్ కు ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరిగిందని, మెమోరాండం ను పరిశీలించిన ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. 27% రిజర్వేషన్లను పొందడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని ఆయనను కోరడం జరిగిందని , రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఓబిసి ఎంప్లాయిస్ యూనియన్ ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఓ బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే యువత మేలుకోవాలని బీసీల యువత చేతుల్లోనే బీసీల అభివృద్ధి అని అన్నారు.

