NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా సహకార బ్యాంక్ మహాజన సభ సమావేశం

1 min read

నూతనంగా ఎన్నికైన చైర్మన్ లు మూడు గంటలు బ్యాంకులో గడపాలి

 డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ

సభాక్షులుగా ఆప్కాబ్  చైర్మన్ గన్ని వీరాంజనేయులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కేంద్ర సహకార బాంకు మహాజన సభ సమావేశం ఆప్కాబ్ చైర్మన్ మరియు డి సి సి బి చైర్మన్ గన్ని వీరాంజనేయులు అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీ కృష్ణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సహకార సంఘాల చైర్మన్లు త్రిసభ్య కమిటీ సభ్యులు, డి సి సి బి సి ఇ ఓ, డి సి ఓ, డి ఆర్  లు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా సహకార బాంకు సి ఇ ఓ సింహాచలం బాంకు ప్రగతిని వివరించారు.సహకార సంఘ పరిధిలో గల సమస్యలను ఆయా సహకార సంఘాల చైర్మన్లు ప్రసావించారు. ముఖ్యంగా డి పాం పట్టాలకు రుణ సౌకర్యం కల్పించాలని, 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్లు కాకుండా 13 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్లకు అనుమతి ఇవ్వాలని, కొన్ని బాంకులలో సిబ్బందిలేక ఇబ్బంది పడుతున్నామని, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గోడౌన్లు ఉపయోగం లేకుండా పోయాయని, అవి నెల నెల ఇంస్టాల్ మెంట్లు మరియు వడ్డి సహకార సంఘాలకు భారంగా మారిందని, కొన్ని సహకార సంఘాలు శిధిలావస్తలో ఉన్నాయని అన్నారు. ఈ సంధర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ సభ్యులు చెప్పిన సూచనలు సమస్యలు అన్ని ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా డి సి సి బి బైలాకనుగుణంగా పరిష్కరించడానికి కృషీ చేస్తానని అన్నారు. గోడౌన్ల సమస్యలను చర్చించి పరిష్కారానికి కృషీ చేస్తామని అన్నారు.  సభ్యుల కోరిక మేరకు జిల్లాలో సహకార సంఘాల సభ్యులకు విడతల వారీగా హైదరాబాద్ లో గల ఉమ్మడి సిటిఐ లో శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిసస్తామని అన్నారు.

About Author