కర్నూలు బి క్యాంపు, డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ లో అవగాహన సదస్సు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి సూచనల మేరకు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి , నవంబర్ 9న జాతీయ న్యాయ సేవ దినోత్సవంను పురస్కరించుకొని ఈ రోజు అనగా 06.11.2025 న కర్నూలు బి క్యాంప్ నందు గల డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ నందు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవ దినోత్సవ ప్రత్యేకత ను, సైబర్ చట్టాలు గురించి, ఉచిత న్యాయ సేవల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం కాలేజీ నందు వివిధ న్యాయ సేవల పథకాల గురించి నిర్వహించిన వ్యాసరచన పోటీల నందు గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జడ్జి చేతుల మీదగా అందించడం జరిగింది.ఈ ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. ఇందిరా శాంతి, వైస్ ప్రిన్సిపల్ హేమంత్, లీగల్ సర్వీసెస్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ ఫక్రునిషా బేగం, డాక్టర్ వింధ్యవాసినీ దేవి, నాగరాజు విద్యార్థులు పాల్గొన్నారు.

