ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి
1 min read

అత్తోటి కిరణ్ కుమార్
కందులూరు , న్యూస్ నేడు : ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి అత్తోటి కిరణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల యొక్క విద్యా ప్రగతిని తరగతి వారీగా సమీక్షించారు. తదుపరి విద్యార్థులలో ఉన్నత స్థానానికి రావడానికి ఎలా ప్రయత్నం చేయాలో, చదువు మీద ఎలా ఆసక్తి కలిగించాలో తెలిపారు. ఈ సంవత్సరం ఉన్నత పాఠశాల గా అప్గ్రేడ్ అయినందున ఉపాధ్యాయులు కష్టపడి పనిచేయాలని , పాఠశాల వివరాలను రివ్యూ చేస్తూ విద్యార్థులలో విద్య పట్ల ఆసక్తి కలిగించాలని, పఠనాశక్తి పెంపొందించుటకు లైబ్రరీ పుస్తకాలను వినియోగించాలని, విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు కలుగజేయాలని, వెనుకబడిన విద్యార్థులకు రెమిడీయల్ శిక్షణ తరగతులు నిర్వహించాలని, అందరు విద్యార్థులు పాఠశాలకు నూతన ఏకరూప దుస్తులు ధరించి వచ్చేలా చూడాలని అన్నారు. సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులలో పఠనాశక్తి కలిగినప్పుడే వారు పాఠశాలకు సక్రమంగా హాజరవుతారని నూటికి నూరు శాతం హాజరయ్యేటట్లు ప్రయత్నించాలని అన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి నిర్వహకులను అభినందించారు. ప్రధానోపాధ్యాయులు జి. సుబ్బారావు ఇతర ఉపాద్యాయులు పాల్గొన్నారు.


