మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ లో.. సంఘ వార్షికోత్సవం..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : నగరంలోని ఉద్యోగ నగర్ లో ఉన్నటువంటి మిలీనియం బాప్టిస్ట్ చర్చి నందు 24వ సంఘ వార్షికోత్సవ ఆరాధన మరియు 22వ బైబిల్ ట్రైనంగే, సిటిహెచ్ కోర్స్ వారి గ్రాడ్యుయేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా కర్మేలు ఎం.బి. సంఘకాపరి. రెవ. M.S. హ్యాపీ పాల్ వచ్చి దైవ సందేశం ఇచ్చారు. అనంతరము మిలీనియం బాప్టిస్ట్ చర్చి సెమినరీ ప్రిన్సిపల్. రెవ.డా. బి. మణిమంజుల గ్రాడ్యుయేషన్ విధ్యార్థులకు సర్టిఫికేట్స్ అందించారు. సంఘం సభ్యులు ప్రభుత్వ ఉద్యోగము నందు పదవి విరమణ పొందిన సంఘ సెక్రెటరీ అన్నెపోగు చంద్రశేఖర్ మరియు . జెడ్ సుశీలమ్మను సంఘం ఘనంగా సన్మానించారు. ఆ తరువాత మిలీనియం బాప్టిస్ట్ సంఘ ఫౌండర్ క్రీస్తు రత్న సేవా విభుషన్ క్రైస్తవ విశిష్ట రత్న రెవ.డా. కె.జె. విజయ్ కుమార్ సినియర్ ఫాస్టర్ మాట్లాడుతూ… దైవసేవే పరమావధిగా 40 సంవత్సరంల నుండి దైవ సేవలో ఉన్నానని క్రీస్తు సువార్త ధ్యేయంగా సేవ చేస్తున్నానని కర్నూల్ నగరంలో ఉన్న షరీన్ నగర్ ఉద్యోగ నగర్ లో ఉన్న క్రైస్తవ కుటుంబాలకు క్రీస్తు సువార్తను అందించాలని 24 సంవత్సరముల క్రిందట ఉద్యోగ నగర్ లో ఈ మిలీనియం బాప్టిస్ట్ సంఘము ప్రారంభించడం జరిగింది అని 30 కుటుంబముల తో ప్రారంభించిన ఈ సంఘం ఈరోజు 150 మంది కుటుంబాలతో దేవుని ఆశీస్సుల వలన అభివృద్ధి చెందిందని ఈ సేవ తనతో ఆగిపోకుండా ఉండాలని తన కుమారుని కూడా దైవ సేవకే అంకితం చేశాననీ దేవుని ఆశీస్సులతో ఒక సంఘంగా ప్రారంభించిన ఈ మిలీనియం బాప్టిస్ట్ సంఘం దేవుని ఆశీస్సులతో ఐదు అనుబంధ సంఘాలను ఏర్పరచుకొని దైవ సువార్తను ప్రకటిస్తున్నామని మిలీనియం సంఘం స్థాపించిన రెండవ సంవత్సరం నుండి బైబిల్ ట్రైనింగ్ కోర్సులను కూడా ప్రారంభించి తన ఆధ్వర్యంలో ఇప్పటివరకు 1050 మంది వరకు దైవ సేవకులుగా మరియు సంఘ కాపరులుగా తీర్చిదిద్ది సంఘ పరిచర్య చేసే విధంగా వారిని పంపించడం జరిగిందని డా.కే.జే విజయ్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమం కేజే విజయ్ కుమార్ అధ్యక్షతన ఘనముగా జరిగింది. ఇందులో అసోసియేట్ సంఘ కాపరి వైస్-ప్రెసరెంట్ జె పొలు సంఘ పెద్దలు, జి. సుంకన్న, జి. శ్యాం సుందర్ రావు, కె. శాంతిరాజు, పి.ప్రసాద్. వి.రాజు. విజయ్ కుమార్ గిలిగింత వినుకొండ సుధీర్ బాబు పాల్గొన్నారు.



