విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ని ప్రారంభించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఆఫీస్ ని సోమవారం జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్-2047 యాక్షన్ ప్లాన్ లో భాగంగా జిల్లా, నియోజకవర్గాల విజన్ డాక్యూమెంట్లు రూపొందించడం జరిగిందని, జిల్లాలో, నియోజకవర్గాల స్థాయిలో విజన్ ఏక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు ఏర్పాటుచేయడం గొప్ప విషయమన్నారు.యూనిట్ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే తో పాటు, జిల్లా స్థాయి అధికారి నోడల్ అధికారిగా ఉంటారని, ఎమ్మెల్సీ, విద్యావేత్త, సంబంధిత టీం సభ్యులు 5గురు మొత్తం 9 మంది ఉంటారన్నారు. పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగ అవకాశాలుతోపాటు 15 శాతం వృద్ధిరేటు సాధించే దిశగా నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలతో నియోజకవర్గ అభివృద్ధికి విజన్ ప్లాన్ అమలును చేస్తారన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు,సిపిఒ వాసుదేవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.