NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అట్టహాసంగా  మార్కెట్ యార్డ్  చైర్మన్ ప్రమాణస్వీకారం

1 min read

ఎమ్మెల్యే బి వి జగనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో

క్షుణ్ణంగా  పరిశీలించి, అందరి అభిప్రాయాల మేరకే చైర్మన్ పదవి కల్పించాం

ప్రతి వర్గానికి చైతన్యం  తెచ్చిన పార్టీ టిడిపి

నూతన పాలకవర్గం యార్డ్ అభివృద్ధికి తోడ్పడాలి  : ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వరరెడ్డి

కర్నూలు పార్లమెంట్లో  బీసీలకు పైకి తెచ్చింది బీవీ మోహన్ రెడ్డి :- తిక్కా రెడ్డి

బీవీ కుటుంబాన్ని బీసీలు రుణపడి ఉంటారు  :- రాఘవేంద్ర రెడ్డి_

గత వైసిపి ప్రభుత్వం  బీసీలకు చిన్న చూపు చూసింది :- కప్పట్రాల బొజ్జమ్మ_

టీడీపీలో కురుబలకు  ప్రత్యేక గుర్తింపుని ఇచ్చింది :- కురువ కార్పొరేషన్ చైర్మన్  దేవేంద్రప్ప

ప్రమాణ స్వీకారం చేసిన  నూతన పాలకవర్గం

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్  నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం  సోమవారం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతన చైర్మన్ కురువ మల్లయ్య, వైస్ చైర్మన్ వాల్మీకి ఆంజనేయులతో పాటు డైరెక్టర్లను  మార్కెట్ యార్డ్ సెక్రెటరీ  ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ  ఎన్నికల్లో ఎవరు ఎంత పని చేశారో అవన్నీ గుర్తు పెట్టుకొని  అందరి అభిప్రాయం అందరికీ పదవులు ఇస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా  అనేక పదవులు రాబోతున్నాయని స్పష్టం చేశారు. బీసీలకు బివి మోహన్ రెడ్డి కుటుంబం  ఎల్లప్పుడూ అగ్రస్థానంలో నిలబెడుతుందని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చూసిన ఈ మార్కెట్  అన్ని విధాల అభివృద్ధి  చేయాలని ఆదేశించారని. ఈ నూతన పాలకవర్గంలో  అన్ని కులాలకు స్థానం కల్పించడం జరిగిందన్నారు. ఈ మార్కెట్ యార్డ్ కు  ఎంతో చరిత్ర కలిగి ఉందని నూతన పాలకవర్గం  అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకుల అభిప్రాయాల మేరకే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కల్పించడం జరిగింది తెలిపారు.

బీసీలకు పైకి తెచ్చింది బీవీ మోహన్ రెడ్డి.

కర్నూల్ పార్లమెంట్ పరిధిలో  బీసీలకు  మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి పైకి తీసుకొచ్చారని టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బడుగు బలహీన వర్గాలకు పెద్దపెద్ద వేశారని, టీడీపీలో అందరికీ పదవులు సొంతం అని ఎమ్మెల్యే బీవీ నిరూపించారన్నారు. ఆదోని మార్కెట్ తర్వాత ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ గా పేరు గాంచింది. చైర్మన్ మల్లయ్య రైతు గా ఉన్నారు. వ్యాపారస్తులు బాగుంటే రైతులు బాగుంటారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం  చేసినప్పటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి.. వైసీపీ వాళ్లు వర్షాలు రావని చేపిన వాళ్లు ఏమి అంటారుని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ హయాంలో ఎవరి ఆస్తి ఎక్కడో తెలియని పరిస్థితి. సీబీన్ హయాంలో భద్రత ఉందన్నారు. జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కేవలం బటన్ నొక్కడం తప్ప.. ఏమి చేయలేదు. చంద్రబాబును గౌరవించి రాష్ట్రాన్ని పెట్టుబడులు పెడుతున్నారు. బీవీ టెక్స్ టైల్ మూలాన పడిన తీసుకొచ్చారు. గుండ్రవుల ప్రాజెక్టు పూర్తి అయితే రైతులకు ఇబ్బందులు ఉండవు. మోహన్ రెడ్డి ప్రతి వీధిని అభివృద్ధి చేశారు. టీడీపీలో పని చేసిన వారికి పదవులు ఖచ్చితంగా ఇచ్చి న్యాయం చేస్తుంది.  బీవీని నమ్ముకున్న వారిని న్యాయం చేస్తారని పేర్కొన్నారు.

గత వైసిపి ప్రభుత్వం బీసీలకు చిన్నచూపు చూసింది :- కప్పట్రాళ్ల బుజ్జమ్మ

బీసీలకు సీఎం చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్, చేశారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు చిన్న చూపు చూసిందన్నారు. ఎమ్మిగనూరు ప్రజలతో మా నాన్నకు ఎంతో సన్నిహితం ఉంది. తాను ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు.

బీవీ కుటుంబాన్ని బీసీలు రుణపడి ఉంటారు

మంత్రాలయం ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి బివి కుటుంబాన్ని  ఎల్లప్పుడు రుణపడి ఉంటారని, బీవీ అంటే బీసీ అని  మంత్రాలయం ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ  బీవీ మోహన్ రెడ్డి మా నాన్నతో రాజకీయాలు చేశారు. బీవీ మోహన్ రెడ్డి కు రెట్టింపు ఎమ్మెల్యే బీవీ చేస్తున్నారు. బీవీ మోహన్ రెడ్డి మాదిరిగా బీసీలు బీవీని గెలిపిస్తారు రుణం తీర్చుకుంటారు ఆయనకు తోడు ఉండాలన్నారు.

కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు పెద్దపీట

జనసేన ఇంచార్జి రేఖ గౌడ్

కూటమి ప్రభుత్వంలో అన్ని పదవుల్లో అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తున్నారని ఇందుకు నిదర్శనం ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ నూతన పాలక వర్గం అని జనసేన ఇంచార్జి రేఖ గౌడ్ పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *