నీటి ముంపు బాధితులపై మనసు రావడం లేదా
1 min read
82 వ రోజుకు చేరిన శ్రీశైలం నీటి ముంపు బాధితుల దీక్ష.?
నందికొట్కూరు న్యూస్ నేడు: 98 జీవో శ్రీశైలం నీటి ముంపు బాధిత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో వారిపై మనసు రావడం లేదా అని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గత 82 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న ముంపు బాధితులకు సోమవారం మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సీపీఐ పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అంటున్న ప్రభుత్వం 82 రోజులైనా దీక్షా శిభిరం వద్ద గాలి,వాన,ఎండనక కుమిలి పోతున్న శ్రీశైలం నీటీ ముంపు భాదితులకు ఇచ్చిన హామీలను 675 మంది ఉద్యోగాలను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.దీక్షా శిబిరం నుండి శ్రీశైలం నీటి ముంపు బాధితులు,పార్టీ నాయకులు,ప్రజాసంఘాల నాయకులతో కలిసి పటేల్ సెంటర్ కూడలి వరకు రాస్తా-రోకో నిర్వహిస్తూ బిక్షాటన చేసి నిరసన తెలిపారు.’రాష్ట్రాభివృద్ది కోసం సర్వస్వం కోల్పోయిన భాదితులను బిక్షగాళ్ళుగా మార్చిన ఘనత కూటమి నాయకులదే అని కన్నీరు కార్చారు.ఇప్పటికైన హమి లిచ్చిన సీఎం ,మంత్రి లోకేష్,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ పట్టణ కార్యదర్శి ఎం.రామకృష్ణ,ఐసా విద్యార్థి సంఘం జిల్లా నాయకులు గణేష్,మహబూబ్ బాష, మహిళా నాయకురాలు ఎస్.నవ్యసానీ,శిరీష,నాగేంద్ర, సాలమ్మ,రాణి తదితరులు పాల్గొన్నారు.

