పందికోన ప్రభుత్వ పాఠశాల నుండి ఏడు మంది విద్యార్థులు గురుకులకు ఎంపిక
1 min read
గురుకుల ఎంపికకు కృషిచేసిన ఉపాధ్యాయుడికి సన్మానం
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ మండలం పందికోన గ్రామం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏడు మంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపికయ్యారు. గురుకుల ఎంపిక అయ్యేందుకు కృషిచేసిన ఉపాధ్యాయుడు ఆవుల నాగరాజును విద్యా కమిటీ చైర్మన్ రాజశేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు సన్మానించారు. పత్తికొండ మండలం పందికోన గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగవ తరగతి బోధిస్తున్న ఆవుల నాగరాజు తన తరగతికి సంబంధించిన ఏడు మంది పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యే విధంగా కృషి చేసినందుకు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ అధ్యక్షతన గ్రామస్తులు, ఉపాధ్యాయులు రాఘవేంద్రమ్మ వెంకటేశ్వర రెడ్డి, ఏబీఎన్ కృష్ణమోహన్, సౌజన్య , సునీత మరియు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆవుల నాగరాజును పూలమా లతో శాలువా తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ జి. రాజశేఖర్ మాట్లాడుతూ, అంకితభావంతో పనిచేస్తున్నటువంటి నాగరాజు లాంటి ఉపాధ్యాయులు సమాజానికి చాలా అవసరం అని అన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నందుకు మా గ్రామంలో మేము ఎంతో గర్వపడుతున్నామని ఆయన చెప్పారు .ప్రతి సంవత్సరం కూడా అనేకమంది పిల్లలను గురుకుల పాఠశాలలకు నాలుగవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు శ్రద్ధతో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎంపికయ్య విధంగా కృషి చేస్తున్న నాగరాజు మా ఉపాధ్యాయ లోకానికి ఆదర్శమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ అభినందించారు.


