NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టణ నీటి సమస్యకు 129 కోట్లు మంజూరు

1 min read

డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన కమిషనర్.. చైర్మన్

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నీటి సమస్యను తీర్చేందుకు గాను 129 కోట్ల 87 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం మున్సిపాలిటీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ  పట్టణ వాసుల చిరకాల స్వప్నమైన మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో భారీ నిధులను విడుదల చేస్తూ పట్టణంలోని 29 వార్డులకు నిరంతర మంచినీటి సరఫరా చేసేందుకు గాను ప్రభుత్వం జీవో జారీ చేసి టెండర్లు పిలవడం జరిగిందన్నారు.మిడుతూరు మండలం  అలగనూరు రిజర్వాయర్ నుండి పంపింగ్ పద్ధతి ద్వారా నీటిని సేకరించి పట్టణానికి తరలించడం జరుగుతుందనినీటి నిల్వ మరియు సరఫరా కోసం పట్టణంలోని కీలక ప్రాంతాల్లో 4 భారీ ఈఎల్ ఎస్ఆర్ (ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్) ట్యాంకు ల నిర్మాణాలు పూర్తి అవుతున్నాయని పట్టణంలో 29 వార్డుల్లో ప్రతి ఇంటికీ ఈ ప్రాజెక్టు ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని అన్నారు.ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పట్టణంలో దశాబ్దాలుగా ఉన్న తాగునీటి ఎద్దడి పూర్తిగా తొలగిపోనుంది.ముఖ్యంగా వేసవి కాలంలో ఎదురయ్యే నీటి ఇబ్బందుల నుండి ప్రజలకు విముక్తి కలుగుతుంది.మంచినీటి శుద్ధి కేంద్రం (డబ్ల్యూటిపి)ద్వారా నాణ్యమైన నీటిని అందించడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవన ప్రమాణాలు పెరుగుతాయని మున్సిపాలిటీ చైర్మన్ అన్నారు.తర్వాత మున్సిపాలిటీ కమిషనర్ తో కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డిఈ నాజీర్, అసిస్టెంట్ ఇంజనీర్ దినేష్ కుమార్,కౌన్సిలర్ చాంద్ భాష మరియు విఆర్ శ్రీను పాల్గొన్నారు.

About Author