NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశ్వ హిందూ పరిషత్ లో కార్యకర్తలకు సమర్పణా భావం, నిబద్ధత అవసరం

1 min read

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్

కర్నూలు, న్యూస్​ నేడు: విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర సమావేశాలు నేడు – రేపు (10,11తేదీలలో) కర్నూలు నగరం సమీపంలోని కే.వీ.సుబ్బారెడ్డి సాంకేతిక కళాశాలలో ఘనంగా ప్రారంభించబడ్డాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ గారు మాట్లాడుతూ….దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే మనం పూర్తిగా నిబద్దతతో, సమర్పణా భావం తో పని చెయాలి. దీని ద్వారా సంస్థ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు,అంతేకాదు తాను ఉంటున్న బాధ్యత నుండి క్రింది స్థాయికి 3 స్థాయిల బాధ్యతల వరకు కార్యకర్తల ఆర్థిక, సామాజిక,స్తితి గతులను పరిశీలీంచి సహాయం సహకారాలు అందిస్తే ఆ సంస్థ విశేషంగా విస్తరిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో…..స్వాత్మానంద స్వామి, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి,మాళిగి వ్యాస్ రాజ్, మురళమ్మ, రెండు రాష్ట్రాల బజరంగ్ దళ్ కన్వీనర్ వీర కుమార్ స్వామి,కేంద్రీయ గో రక్షా కో కన్వీనర్ ఆకారపు కేశవరాజు, సకార్యదర్శి పర్రె కోటేశ్వర రావు, సహ కార్యదర్శి ప్రాణేష్, కోషాధికారి సందడి మహేశ్వర్, సహకోషాదికారి గూడా సుబ్రహ్మణ్యం, విశేషసంపర్క కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, ప్రచార – ప్రసార విభాగం కన్వీనర్ మాళిగి భానుప్రకాష్, ఇతర ఆయాం ప్రముఖులు, 16 జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *