NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా డా. సాయి సుధీర్‌ నియామకం..

1 min read

వైద్య విద్యార్థుల పాలిట వరం

మైనారిటీ ఉద్యోగుల సంఘం శుభాకాంక్షలు, అభినందనలు..

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసి), కర్నూలుకు చెందిన డా. సాయి సుధీర్  డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడకు రిజిస్ట్రార్ గా నియమితులైన శుభ సందర్భంగా మైనారిటీ ఉద్యోగుల సంఘం తరపున ఈ రోజు ఘనంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ నాయకులు డా. సాయి సుధీర్  సేవలు, పరిపాలనా అనుభవం విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ ఆల్తాఫ్ హుస్సేన్, డిఎస్పీ  మహబూబ్ బాషా, యూనస్ అలీ, డా. విజయ్‌కుమార్, సమీల్లా ఖాన్, సమద్, మగ్బూల్ బాషా, ఎజాజ్ బాషా తదితరులు పాల్గొని డా. సాయి సుధీర్ ని ఘనంగా సన్మానించారు.

About Author