లీగల్ అడ్వైజరీ ఏర్పాటు చేయాలి
1 min read

ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి
నందికొట్కూరు, న్యూస్ నేడు: వైయస్ఆర్సీపీ కార్యకర్తల కోసం నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లాస్థాయిలో కానీ లీగల్ అడ్వైజరీ ఏర్పాటు చేయాలని ఐటీ వింగ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని విఐపి కాలనీలో గురువారం నందికొట్కూరు వైసిపి ఇన్చార్జి డాక్టర్ సుధీర్ స్వగృహంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కల్పలతా రెడ్డి,ఆత్మకూరు బుడ్డా శేషారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలను కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.వచ్చే స్థానిక మరియు 2029 ఎన్నికల్లో సిద్ధార్థ రెడ్డి మరియు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో ఇక్కడ వైసిపి జెండా ఎగురవేస్తామని రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.


