గుండెపోటుకు గురైన డ్రైవర్..తప్పిన ప్రమాదం
1 min read
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు బాట దగ్గర ఆర్జీఎం ఇంజినీరింగ్ కాలేజీ బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళ్తే నందికొట్కూరు పట్టణంలో సంగయ్యపేట కాలనీలో నివాసం ఉంటున్న రేనాటి మధార్ సాహెబ్(51) నంద్యాల ఇంజనీరింగ్ కళాశాల బస్సు(ఏపి 21 టి ఎక్స్ 6897)డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.రోజూ మాదిరిగా శనివారం ఉదయం 8:15 నిమిషాల సమయంలో నందికొట్కూరు నుండి ఇంజనీరింగ్ విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని నంద్యాలకు వెళ్తూ ఉండగా జలకనూరు బాట దగ్గర డ్రైవర్ కు గుండెపోటు రావడంతో వెంటనే కుప్పకూలిపోవడంతో బస్సు రోడ్డు దాటి పొలాల్లోకి వెళ్ళింది.వెంటనే గమనించిన ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రైవర్ ను మిడుతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు డాక్టర్లు ద్రవీకరించారు. ఈయన స్వగ్రామం గడివేముల మండలం గని గ్రామం అయితే గత కొన్నాళ్లుగా నందికొట్కూరులో నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బస్సులో 15 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు.

