ఏలూరు జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో సమీక్ష సమావేశం
1 min read
విచారణలో ఉన్న కేసులపై సమీక్ష ,న్యాయ స్థానాలలో విచారణ ఉన్న కేసులు వేగవంతం చేయుట కొరకు కోర్టు మానిటరింగ్ సిబ్బందికి ఆదేశాలుజారీ
ఏలూరుజిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్
ఏలూరు, న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఏలూరు జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో సమీక్ష సమావేశం ను నిర్వహించినారు.ఈ కార్యక్రమములో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విచారణ లో ఉన్న కేసు లపై సమీక్ష, న్యాయ స్థానాలలో విచారణ ఉన్న కేసు లు వేగవంతం చేయుట కొరకు కోర్టు మానిటరింగ్ సిబ్బందికి ఆదేశాలుజారీచేశారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లోని సమావేశ మందిరంలో కోర్టు మానిటరింగ్ సభ్యులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ కోర్టు మానిటరింగ్ సిబ్బంది వచ్చే వారం అన్ని న్యాయస్థానాలలో ట్రైల్ కేసులను గురించి సిబ్బందిని వాటి యొక్క వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు.జిల్లా ఎస్పీ ఏలూరు,జంగారెడ్డి గూడెం,నూజివీడు, పోలవరం సబ్ డివిజన్‌లకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కోర్టు లో కేసులు యొక్క విచారణ వేగవంతం చేయుట కొరకు తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చినారు.సాక్షుల సకాలంలో హాజరు కేసుల విచారణ వేగంగా జరగాలంటే సాక్షులను సమయానికి హాజరు చేయడం తప్పనిసరి అని ఎస్పీ స్పష్టం చేశారు. విచారణలో జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులదేనని తెలిపారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్తులు శిక్ష నుండి తప్పించుకోకూడదని, బాధితులు న్యాయం పొందేలా ముద్దాయి లకు శిక్షలు పడేలా సమర్థంగా పని చేయాలని సూచిం చారు.దిశా నిర్దేశం కోర్ట్ మానిటరింగ్ సెల్ సభ్యులకు జిల్లా ఎస్పీ వారి విధి నిర్వహణపై దశ దిశను నిర్ధారించి తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చానారు.డాక్యుమెంటేషన్ ప్రతి రోజు కోర్టులో జరిగిన ప్రక్రియను డాక్యుమెంట్ చేసి, తక్షణమే సంబంధిత స్టేషన్ ఆఫీసర్ స్థాయికి నివేదించాలని సూచించారు.సుల పర్యవేక్షణ కోర్ట్ మానిటరింగ్ సెల్ సభ్యులు వ్యక్తి గతంగా తాము నిర్వర్తించే విధులు, విచారణలో ఉన్న కేసుల వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు.అధికారులు ప్రతి కోర్టులో న్యాయ విచారణలో ఉన్న కేసుల వివరాలను ఎప్పటి కప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమములో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి, ఏలూరు డిఎస్పి డి.శ్రావణ్ కుమార్,ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి యు రవిచంద్ర,కోర్టు మానిటరింగ్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ హబీబ్ బాషామరియు కోర్ట్ మానిటరింగ్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.


