వివాహానికి హాజరైన జడ్పిటీసీ యుగంధర్ రెడ్డి
1 min read
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో బుధవారం ఆర్ సీఎం చర్చిలో జరిగిన ప్రవీణ్ మరియు ప్రమీల వివాహం ఘనంగా జరిగింది. కడుమూరు గ్రామానికి చెందిన గుండం దేవదాసు సుగుణమ్మ కుమారుడు ప్రవీణ్ కుమార్ మరియు మాసపేట గ్రామానికి చెందిన ఎం చిన్న నాగరాజు, మరియమ్మ కూతురు ప్రమీల వివాహ కార్యానికి మిడుతూరు మండల జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఆర్ సిఎం విచారణ గురువులు ఫాదర్ మధుబాబు వివాహాన్ని జరిపించారు.ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల వైఎస్సార్సీపి కార్యదర్శి కడుమూరు దేవ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

