NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూల్ జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్…

1 min read

సాంకేతికతతో నేరాల కట్టడి.ప్రజల భద్రతే లక్ష్యం.

డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణ.

కర్నూలు ఎస్పీ

కర్నూలు, న్యూస్​ నేడు:  శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు  కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  మంగళ వారం తెలిపారు. ఈ  సంధర్భంగా   ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ (డిజిపి ఆఫీసు )  నుండి జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన  3 నూతన డ్రోన్ కెమెరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. డే విజన్, నైట్ విజన్ డ్రోన్ కెమెరాల ద్వారా పగలు, రాత్రి నిరంతర నిఘా ఉంటుందన్నారు. జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలోని కాలేజ్ లు, స్కూల్స్ వద్ద డ్రోన్ కెమెరాలతో గట్టి  నిఘా  ఉంచి  ఆకతాయిలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీసీ కెమెరాల వినియోగంతో పాటు డ్రోన్ టెక్నాలజీని సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాలో ప్రశాంత వాతావరణo కొనసాగే విధంగా గట్టి చర్యలు చేపడతామని కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసుధన్ రావు, సైబర్ ల్యాబ్ సిఐ మస్తాన్ వలి, ఆర్ ఐ నారాయణ,  సైబర్ ల్యాబ్ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author