NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని కల్తీ చేస్తే కూటమి ప్రభుత్వం శుద్ధి చేస్తుంది

1 min read

అమరావతి, న్యూస్​ నేడు:    : ఈరోజు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హస్సన్ బాషా గారి ఆధ్వర్యంలో సహచర హజ్ కమిటీ సభ్యులతో కలిసి ఉండవల్లి లోని విద్యా మరియు ఐటీ శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సూరి మన్సూర్ అలీ ఖాన్. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ కి 2026 హజ్ యాత్రను పురస్కరించుకుని సంబంధిత ఫైనాన్స్, సర్వీసెస్, సౌకర్యాల గురించి వివరించి, రాష్ట్రంలో హజ్ హౌస్ నిర్మించడానికి ఆరు నుండి ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సూరి మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవస్థలను కల్తీ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శుద్ధి చేస్తుందని తెలిపారు. గతంలో హజ్ హౌస్ కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు పునాది వేయగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క ఇటుక కూడా పేర్చలేకపోయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మైనారిటీ ముస్లింల కొరకు అనేక సంక్షేమ పథకాలను వర్తింప జేస్తూ, మంచి చేస్తుందని పేర్కొన్నారు. మన ప్రభుత్వంలో అన్నీ వర్గాలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, మైనార్టీల చదువు కోసం కర్నూల్ లో మంత్రి టీజీ భరత్ సహకారంతో ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణం కొరకు చర్యలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. అలాగే మన రాష్ట్రంలో హజ్ హౌస్ నిర్మించడానికి ప్రాధాన్యత ఇస్తామని  నారా లోకేష్  సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

About Author