“నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ (My Yuva Bharat) చేపట్టిన దేశవ్యాప్త “నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్” ప్రారంభ కార్యక్రమాన్ని కర్నూలు మై భారత్ కేంద్రం ఈ రోజు విజయవంతంగా సిల్వర్ జూబ్లీ కళాశాలలో నిర్వహించింది.ఈ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా 100 వారాల పాటు ప్రజల భాగస్వామ్యంతో సాగే జన్ భాగీదారి ఉద్యమానికి నాంది పలుకుతూ, వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు యువత ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మై భారత్ కర్నూలు కేంద్ర జిల్లా. యువజన అధికారి ఐజయ్య యువత తో “నషా ముక్తి భారత్ ప్రతిజ్ఞ” చేసి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు సమాజాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు.దేశవ్యాప్తంగా 25 వేలకుపైగా కేంద్రాల్లో ఒకేసారి నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోటికి పైగా యువత పాల్గొని ప్రతిజ్ఞ చేయడం విశేషం అని ఇది మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా దేశంలోనే అతిపెద్ద యువజన ఉద్యమాలలో ఒకటిగా నిలిచిందని, ఈ అభియాన్ రానున్న 100 వారాల పాటు అవగాహన ర్యాలీలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ధ్యాన శిబిరాలు, చర్చా కార్యక్రమాలు, వీధి నాటకాలు, పోటీలు మరియు వాలంటీర్ల ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా కొనసాగనుందని తెలిపారు .కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు శెట్టి మాట్లాడుతూ కర్నూలు మై కేంద్రం వాలంటీర్లు, యువతతో పాటు ప్రతి పౌరుడు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, మత్తు పదార్థాల రహిత – వికసిత్ భారత్ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, విద్యాసంస్థల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఇతర భాగస్వాములు ఉత్సాహంగా పాల్గొన్నారు.


