పదవి విరమణ పొందిన నీరుగట్టు రామచంద్ర కు ఘన సన్మానం
1 min read
ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన ఓ ఆదర్శ అధికారి
రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా (న్యూస్ నేడు ప్రతినిధి): కడప జిల్లా డిప్యూటీ సీఈఓగా పదవీ విరమణ చేసిన నీరుగట్టు రామచంద్రను ఆదివారం రాయచోటి పట్టణంలోని అజయ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు శాలువా కప్పి ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రభుత్వ సేవలో ఎన్నో సంవత్సరాల పాటు నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని విధులు నిర్వర్తించిన నీరుగట్టు రామచంద్ర సేవలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా నిలిచిపోతాయి. ఆయన పరిపాలనా అనుభవం, సేవా తత్వం, మానవీయ విలువలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమే… సేవాభావానికి కాదు. సమాజానికి మీ అనుభవం, మార్గదర్శకత్వం భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.దైవానుగ్రహంతో మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో జీవించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. మీ విశిష్ట సేవలకు హృదయపూర్వక అభినందనలు… పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు.


