డీఎస్సీ 2003 టీచర్లకు పాత పెన్షన్ అమలుపై డిటిఎఫ్ హర్షం
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ : టీచర్లకు మేలుచేసేలా మంత్రివర్గ సమావేశంలో 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పై డిటిఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జి భీమన్న, విజి వెంకటరాముడు, రాష్ట్ర కార్యదర్శి జి తిమ్మప్ప విలేకరులతో విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు మేలు చేసిన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల సుదీర్ఘకాలం పోరాటం వలన ఈ విజయం సాధ్యమైందన్నారు. అలాగే ఎంతోకాలంగా అపరస్కృతంగా ఉన్న ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పరీస్కారంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ నిర్ణయం వలన 11,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఫలాలు అందనున్నాయి. ఇంకా మిగిలి ఉన్న అందరూ ఉద్యోగ ,ఉపాధ్యాయులకు కూడా కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ,వారందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులువీజీ.వెంకటరాముడు, జీ.భీమన్న, స్టేట్ సెక్రటరీ జి.తిమ్మప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణ,జిల్లాఉపాధ్యక్షులు రోషన్న, కార్యదర్శి మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

