NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యాశాఖలో తక్షణమే ప్రమోషన్లు చేపట్టాలి

1 min read

అర్హులైన ఉపాధ్యాయులందరికీ అడహాక్ ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించాలి

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) డిమాండ్

ఒంగోలు , న్యూస్​ నేడు:   రాష్ట్రంలోని ఇతర అన్ని శాఖల్లో ప్రమోషన్లు ప్రక్రియలు కొనసాగుతున్నప్పటికీ విద్యాశాఖలో మాత్రం జిల్లా విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపుల అంశాన్ని కారణంగా చూపుతూ ఈ సంవత్సరం ప్రమోషన్లు నిలిపివేయడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్. శ్రావణ కుమార్, జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కె.మల్లికార్జున రావు, టి. దిలీప్ చక్రవర్తి లు  డిమాండ్ చేసారు.ఒంగోలు లోని సంఘ కార్యాలయం లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించాల్సిన నిబంధనలు ట్రాన్స్ఫర్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ విద్యాశాఖలో వాటిని అమలు చేయకపోవడం వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. ముఖ్యంగా పదోన్నతులకు అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. నిన్నటి జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో జిఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ ఎస్ రావత్ గారు కూడా ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్లు చేపట్టడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇందులో భాగంగానేరాష్ట్ర  ప్రభుత్వం ఈ రోజు పోస్టుల ఫ్రీజింగ్ గడువును జూలై 5, 2026 వరకు పొడిగించిన నేపథ్యంలో, ఆ గడువును సద్వినియోగం చేసుకుని కనీసం అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ వెంటనే ప్రమోషన్లు కల్పించాలని ఆపస్ సంఘం కోరింది. అనంతరం నూతన జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు చేపట్టినప్పుడు సీనియారిటీ వివాదాలు తలెత్తకుండా తాత్కాలికంగా అడ్-హాక్ ప్రాతిపదికనైనా పదోన్నతులు ఇవ్వాలని సూచించింది.జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పేరుతో విద్యాశాఖ ఉద్యోగుల న్యాయమైన హక్కులను నిరవధికంగా వాయిదా వేయడం సమంజసం కాదని ఆపస్ అభిప్రాయపడింది.  ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రమోషన్లు, బదలీ షెడ్యూల్ ప్రకటించి అమలు చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో జిల్లాబాధ్యులు కె. శ్రీనివాసరావు., గుణప్రసాద్, నరసింహ, వి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *