విద్యారంగ … ఉపాద్యాయ సమస్యల పరిష్కారం కోసం మలిదశ ఉద్యమం!
1 min read

పది స్పాట్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు – ఫ్యాప్టో
కర్నూలు, న్యూస్ నేడు: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్య ల పై ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం మలి దశ పోరాటం కొరకు పిలుపు ను ఇచ్చింది. దాని ప్రకారం నేటి సాయంత్రం కర్నూలు యందలి ఎస్ టి యు భవన్ లో ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం జరిగింది.ఈ సమావేశం నకు ముఖ్య అతిథులుగా ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ మరియు కర్నూలు ఇంచార్జి కాకి ప్రకాష్ రావు మరియు, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి హృదయ రాజు హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కో చైర్మన్ ప్రకాష్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల ఆర్థిక సమస్యలు మరియు ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారం కొరకు పదవ తరగతి మూల్యాంకనం కేంద్రాల యందు నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరు కావడం మరియు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మూల్యాంకన కేంద్రాల యందు నిరసన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది అని ఈ కార్యక్రమంలో అందరూ ఉపాధ్యాయులు హాజరు కావాలని కోరడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి హృదయ రాజు మాట్లాడుతూ ఏప్రిల్ 25, 26 మరియు 27 వ తేదీల్లో విజయవాడ లో రిలే నిరహార దీక్ష కార్యక్రమం ఫ్యాప్టో నిర్వహిస్తుంది అని ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని పిలుపు ను ఇచ్చారు.ఈ సన్నాహక సమావేశం నకు ఫ్యాప్టో కర్నూలు జిల్లా చైర్మన్ సేవా లాల్ నాయక్ అధ్యక్షత వహించారు, సెక్రటరీ జనరల్ భాస్కర్ గారు, యు టీ ఎఫ్ నుండి ఇబ్రహీం, ఎస్ టి యు నుండి జనార్దన్, సుంకన్న, ఎ పి టి ఎఫ్ 257 నుండి ఖాసీం, రంగన్న, ఎ పి టి ఎఫ్ 1938 నుండి ఇస్మాయిల్,మరియానందం, ఆప్టా నుండి మధుసూదన్ రెడ్డి, గోపాల్ డి టి ఎఫ్ నుండి రోషన్న, పి ఐ టి అసోసియేషన్ నుండి లక్ష్మన్న ప్రధానోపాధ్యాయ సంఘము నుండి హుస్సేన్ మరియు యోగీశ్వరుడు తదితరులు పాల్గొనటం జరిగింది .

