NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గరుడ వాహన సేవ లో… ఏకాంత రాముడు

1 min read

కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు పాత నగరం మైన్ బజార్ లో వందేళ్ల వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్న పేట శ్రీ రామాలయం లో శనివారం  ఉ. 5 గం.లకు  ఆలయ ప్రధానార్చకులు మాళిగి హనుమేషాచార్యుల వారి ఆధ్వర్యంలో స్వామి వారికి సుప్రభాత సేవ, మహాభిశేకం,  ప్రత్యేకంగా సునీల్ , అచ్యుత కృష్ణ , వేంకటేష్ చే శ్రీ వేంకటేశ్వర స్వామి  అవతారంలో శ్రీ ఏకాంత రాముల వారుగా ప్రత్యేక అలంకార లో దర్శనం ఇచ్చారు. అనంతరం కడప వాస్తవ్యులైన పం. మాళిగి విద్యానిధీ ఆచార్యులు,రవీంద్ర సింహం ఆచార్యులు ఆధ్వర్యంలో  ఆర్జిత విశేష కళ్యాణము జరిపించారు, అలాగే బెంగుళూరు వాస్తవ్యులైన సుధా పండితులు పం. శ్రీకాంతాచార్యులచే  పండిత ప్రవచనము అనంతరం సా.7:00 శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతుని సహితంగా “గరుడవాహన సేవ”  పురవీధులగుండా ఊరేగింపు నిర్వహించారు, రేపు 5 వ తేదీ ఆది వారము రోజున ఈ 10:30 గం.లకు శ్రీ సీతారాముల కళ్యాణం, సాయంకాలం దివ్యమంగళ రథోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. తరువాత స్వామి వారి ఉత్సవమూర్తులకు “ఊంజల్ సేవ” నిర్వహించారు, ఈ సందర్భంగా శ్రీమతి మాళిగి పావనీ ఆధ్వర్యంలో భరత నాట్యం, భక్తి పాటలు,నేటి సమాజంలో  మహిళల పాత్ర పై చర్చా కార్యక్రమం నిర్వహించారు.  చి. సుస్మితా, హేమ శ్రీ, సత్య స్నేహిత, చే భరతనాట్య ప్రదర్శన జరిగినది. జీ.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత పి.సుబ్బారెఢ్ఢి సౌజన్యంతో అన్నప్రసాదం, అలాగే ప్రముఖ స్వీట్ వ్యాపారస్తులు బూంది సత్యం వారి సహకారంతో స్వీట్ వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో  శ్రీమతి లతా, ప్రభావతి,  జాహ్నవి, జయలక్ష్మీ, సవిత,విజయలక్ష్మీ, వసుధ, కళ్యాణి, సుజాత, వేదవతి, అంజనా, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *