వాస్తవాలను ప్రజలకు చేరవేసేదే మీడియా
1 min read

క్యాలెండర్ ను ఆవిష్కరించిన రూరల్ సీఐ..ఎస్ఐ
నందికొట్కూరు, న్యూస్ నేడు: వాస్తవాలను ప్రజలకు చేరవేసేదే మీడియా అని నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో పల్లె వెలుగు ఇన్చార్జి డి స్వాములు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 2026 నూతన సంవత్సర పల్లెవెలుగు క్యాలెండర్ ను సీఐ మరియు మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ క్యాలెండర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను వార్తల రూపంలో ప్రభుత్వానికి తీసుకువెళ్తూ అదేవిధంగా ప్రభుత్వపరంగా విషయాలను మీడియా చేరవేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సాధిక్ పాల్గొన్నారు.


