NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవనకొండ మండలంలో వెంటనే ఉపాధి పనులు చేపట్టాలి

1 min read

ఫేస్ యాప్ ను రద్దు చేసి ,పాత పద్ధతిలోనే పని కొనసాగించాలి

 వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ 

మండల వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం సచివాలయం ముందు నిరసన

న్యూస్ నేడు, పత్తికొండ: మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు కల్పించాలని, కరివేములలో వెంటనే ఉపాధి పనులు మొదలుపెట్టాలని, అదేవిధంగా ఉపాధి ఉసురు తీసే ఫేస్ యాప్ ను రద్దు చేయాలని, రెండు పూటల పని పేరుతో కూలీలను వేధించవద్దని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ డిమాండ్ చేశారు.బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉపాధి పరిరక్షణ, పనులు కల్పన, ఫేస్ యాప్ రద్దు, పాత పద్ధతిలోనే ఉపాధి పని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయింపు మండలంలోని తెర్నేకల్,కోటకొండ, కుంకనూరు, దేవనకొండ సచివాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు కూలీలతో కలిసి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వీరశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మహబూబ్ బాషా కార్యదర్శి వీరేంద్ర నాయుడు సిఐటియు మండల కార్యదర్శి అశోక్ , యూసుఫ్ భాష, డివైఎఫ్ఐ నాయకులు అనిలు లు ఆయా గ్రామాల లో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ( విబి-రాంబి) తో గ్రామీణ ప్రాంతాల్లో నీరుద్యోగం మరింతగా పెరిగిపోతుందనీ  ఉపాధికి  ఇది ఉరితాళ్ళు మోసపూరిత కుట్రఅని , కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి, గ్రామీణ కార్మికులను కార్పొరేట్ శక్తులకు చౌక శ్రమగా మార్చడానికి పద్ధతి ప్రకారం దీన్ని బలహీనపరుస్తుంది, వి బి జి రాంజీ అనేది పని హక్కులను కాలరాసే ఒక ప్రమాదకరమైన స్కీమ్ అని అన్నారు. ఇది ఉపాధి కల్పించే చట్టం కాదన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *