ఇంజనీర్స్ దినోత్సవం…
1 min read
మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వమే సర్ బిరుదుతో సత్కరించింది
లయన్స్ క్లబ్ ప్రతినిధి ఎస్. మాణిక్యాంబ అధ్యక్షతన గంగా కావేరి సీడ్స్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ దినోత్సవం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు దుర్గా తేజ లయన్స్ క్లబ్ ప్రతినిధి ఎస్ మాణిక్యాంబ అధ్యక్షతన గంగా కావేరి సీడ్స్ ఆఫీస్, ఏలూరు నందు ఇంజనీర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. మాణిక్యాంబ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలకు మెచ్చిన ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వమే వారిని సర్ బిరుదుతో సత్కరించిందంటే మనమందరం గర్వించదగ్గ విషయం అన్నారు. క్లబ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఫాదర్ పి బాల , లయన్స్ ఇండియా మ్యాగజైన్ అసోసియేట్ ఎడిటర్ వి.కె పంకజాక్షన్ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ తన వృత్తిగానే కాకుండా దేశ భవిష్యత్తుకు కూడా ఎలా ఉపయోగపడుతుందోనని నిరూపించినటువంటి భారతీయ మహా మనిషి అని కొనియాడారు. గంగా కావేరి సీడ్స్ జనరల్ మేనేజర్ వి వి అనంతరామం మాట్లాడుతూ మనిషి మేధస్సుకు శాస్త్రీయత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చునని, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని నిరూపించినటువంటి గొప్ప శాస్త్రవేత్త సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని, ఆయన సేవలను భరతజాతి ఏనాటికి మరువదని అన్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్లైన సిహెచ్ మారుతి వెంకటరత్నం, ఎస్ ఎస్ ఎల్ కె రవికాంత్, బి ఎన్ ఎస్ మూర్తి బాబు, కొమ్మారెడ్డి నరేంద్రబాబు, బలుసు రామకృష్ణ లను సత్కరించారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సిహెచ్ వెంకటేశ్వరరావు, వ్యాఖ్యాతగా వి వెంకట స్వామి వ్యవహరించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు డి వి రమణ, యు నాగేశ్వరరావు, గీత పంకజ్ తదితరులు పాల్గొన్నారు.


