NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‎ఆళ్ల నాని మృతి పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి

1 min read

ఆళ్ల నాని మృతి ఏలూరు ప్రజలకు తీరని లోటు అన్న ఎంపీ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) ఆకస్మిక మృతి పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాకు ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆళ్ల నాని మృతి ఏలూరు ప్రజలకు తీరని లోటు అన్న ఎంపీ, నాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 2004 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రెండు దశాబ్దాలకు పైగా ఏలూరుతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో, ప్రజాసేవలో ఆళ్ల నాని తనదైన ముద్ర వేశారని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *