NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వినాయక చవితి వేడుకలు….

1 min read

బుడగజంగాల కాలనీలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

వినాయకుడి ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్ష

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలోని బుడగజంగాల కాలనీలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. అనంతరం బుడగజంగాల టీడీపీ సీనియర్ నాయకులు రామాంజీ, గోవిందు, దామన్న, యరన్న, జమన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.వినాయకుడికి పుష్పాలు, పత్రాలతో పూజలు నిర్వహించి, భక్తులు విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వినాయక చవితి పర్వదినం సందర్భంగా బుడగజంగాల కాలనీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఐకమత్యంతో పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.వినాయకుడి ఆశీస్సులతో కాలనీ ప్రజలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా, ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు చేకూరాలని వారు ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *