NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆంగ్ల భాష నైపుణ్యం తప్పనిసరి – జిల్లా కలెక్టర్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్లభాషపై దృష్టి సారించాలని అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా విద్యాధికారి యస్. శ్యామ్యూల్ పాల్ మరి కొంతమంది విద్యాశాఖ అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పూర్వ ప్రాథమిక విద్య ప్రాథమిక విద్యలోనే ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు జిల్లావ్యాప్తంగా 20 మంది రిసోర్స్ పర్సన్లను నియమించాలని, 20 మందికి రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్లతో శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. వెంటనే ప్రణాళిక కార్యచరణ రూపొందించాలని తక్షణమే అమల్లోకి రావాలని ఆదేశించారు. ఆంగ్లంలో ప్రాథమిక స్థాయి నుండి ప్రారంభించబడి వ్యాకరణంతో విద్యార్థి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఆంగ్లం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పాలని ఈ పోటీ ప్రపంచంలో తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జిల్లాలో విద్యాభివృద్ధికి నిర్ణయాత్మక నిర్మాణాత్మక కృషి జరగాలని ఈ దిశగా విద్యాశాఖ యంత్రాంగం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.

About Author